
14
Aug 2015మద్యపాన వ్యసనానికి గల సంకేతాలు ఏమిటి?
Posted by Responsible Consumption / in మద్యపాన ప్రభావాన్ని అదుపు చేయడం / No comments yet
మద్యపాన వ్యసనం మరియు మద్యపాన దూరపయోగం యొక్క సంకేతాలు ఒకే రకంగా ఉంటాయి, మరియు తరచుగా అవి తీవ్రత లేదా స్థాయి ఎంత అనే ప్రశ్నగా ఉంటాయి.
మద్యపాన వ్యవసనం అలాగే మద్యపాన దురుపయోగం యొక్క సంకేతాలు, లక్షణాలలో కొన్ని:
- ఒంటరిగా తాగటం.
- రహస్యంగా తాగటం.
- ఎంత మొత్తంలో మద్యపానం వినియోగించాలో పరిమితం చేయలేకపోవటం.
- తాత్కాలికంగా స్పృహ లేకపోవటం – చిన్న చిన్న సమయాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవటం.
- ఆచార కర్మలను కలిగి ఉండటం మరియు ఈ ఆచార కర్మలు భంగపరిచినప్పుడు లేదా వ్యాఖ్యానించబడినప్పుడు చిరాకు/ కోపం రావటం. ఇది భోజనానికి ముందు / మధ్యలో / తరువాత, లేదా పని తరువాత తాగటం కావచ్చు.
- వ్యక్తి ఆనందించే అభిరుచులు మరియు కార్యకలాపాలను వదిలేయటం/ వాటి పట్ల ఆసక్తిని కోల్పోవటం.
- తాగాలనే కోరిక ఉన్నట్లు అనిపించటం.
- తాగే సమయాలు సమీపిస్తున్నప్పుడు చిరాకుగా అనిపించటం. మద్యం అందుబాటులో లేనప్పుడు ఈ అనుభూతి మరింత తీక్షణ అవుతుంది లేదా అది లభించే అవకాశం లేనప్పుడు కనిపిస్తుంది.
- అవకాశం లేని ప్రదేశాలలో మద్యం నిల్వలను కలిగి ఉండటం.
- తాగి ఉండడానికి మరియు తరువాత బాగున్న అనుభూతి పొందటానికిగాను ఒక్కసారిగా మింగటం.
- బంధుత్వ సమస్యలు కలిగి ఉండటం (తాగటం వలన సంభవించినది).
- చట్టంతో సమస్యలు కలిగి ఉండటం (తాగటం వలన కలిగినవి).
- పని సమస్యలు కలిగి ఉండటం (తాగినందు వలన కలిగినవి లేదా మూల కారణం తాగుడు).
- డబ్బు సమస్యల్ని కలిగి ఉండటం (తాగటం వలన కలిగినది).
- మద్యపాన ప్రభావాన్ని అనుభవించటానికి అది పెద్ద మొత్తంలో అవసరం కావటం.
- తాగనప్పుడు వికారం, చెమటలు పట్టటం లేదా శరీరం కంపించటం జరుగవచ్చు.
మద్యపాన దుర్వినియోగం చేసిన ఒక వ్యక్తి ఈ సంకేతాలు మరియు లక్షణాలలో అనేకమైన వాటిని కలిగి ఉండవచ్చు – కానీ మద్యపాన వ్యసనపరుల మాదిరిగా అవి ఉపసంహరణ లక్షణాలను లేదా తాగడానికి అదే స్థాయి తప్పనిసరి స్థితినీ కలిగి ఉండవు.
మద్యపాన వ్యసనానికి సంబంధించిన సమస్యలు విస్తృతమైనవి, మరియు ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా ప్రభావితం చేస్తాయి. తాగుడు సమస్య గల ఒక వ్యక్తికి తాగుడు తప్పనిసరి అవుతుంది – అది అన్ని రకాల కార్యకలాపాలకు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది అనేక సంవత్సరాల పాటు గుర్తించబడకుండా ఉండిపోవచ్చు.