విరివిగా తాగటాన్ని నివారించేందుకు నేనేమి చేయాలి?
Posted by Responsible Consumption / in విపరీతమైన తాగుడు /
విరివిగా తాగటాన్ని నిరోధించటానికి వ్యక్తిగత చర్యలు కూడా తీసుకుంటారు:
- విపరీతంగా తాగటం వలన కలిగే ఆరోగ్య పరిణామాల గురించి జాగ్రత్త వహించండి. విపరీతమైన తాగుడుతో సంబంధం గల సమస్యలను తెలుసుకునే ఉండడం విపరీతమైన తాగుడును అధిగమించటానికి స్పష్టమైన నిర్ణయం చేయటంలో ఒక ముఖ్య భాగం.
- విపరీతంగా తాగేందుకు ప్రేరేపించే పరిస్థితులు మరియు సంభావ్యతలను నిరోధించండి. కార్యక్రమంలో మద్యపానం సేవించటం ప్రధాన దృష్టిగా ఉండే పార్టీలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. తాగడంలో పోటీలు లేదా ఆటలలో పాల్గొనటాన్ని నిరోధించండి.
- ప్రామాణిక డ్రింక్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. సర్వసాధారణంగా తాగవచ్చని సిఫారసు చేసిన మొత్తం కంటే తీసుకునే మొత్తం ఎక్కువగా ఉంటున్నట్లు తెలుసుకోండి.
- నిదానంగా వినియోగించండి. ఒక సమయంలో మీ పానీయాన్ని కొన్ని గుటకలు మాత్రమే తీసుకోండి. ఒక గంటలో బహుళ పానీయాలు తాగరాదు. మద్యపానం చేసేటప్పుడు మీరు ఆఖరి గుటక వేసిన 90 నిమిషాల తరువాత మీ శరీరం మద్యాన్ని ఇముడ్చుకుంటుంది, మరియు మీ శరీరం ఎంతగా ప్రభావితం అయిందో మీరు వెంటనే గ్రహించలేకపోవచ్చు.
- సోడా లేదా ఇతర మద్యపాన-రహిత పానీయాలను తాగడానికి ఎంచుకోండి.
- ఒకే రకమైన వినియోగ పరిమితులను పాటించే మిత్రులతో బయటకు వెళ్ళండి. ఆ పరిస్థితికి స్నేహితులు ఎక్కువగా సమూహ ఒత్తిడిని తీసుకువస్తారు. మీ పరిమితులను గౌరవించే మరియు విపరీతమైన తాగుడును ఎంచుకోని స్నేహితులను ఎన్నుకోండి.
- ఆల్కోపాప్స్ కు దూరంగా ఉండండి. ఆల్కోపాప్స్ లో చక్కెర విరివిగా ఉఁటుంది, కనుక అవి రుచిగా ఉంటాయి మరియు సాంప్రదాయిక సోడా పానీయాల మాదిరిగా తాగుతారు. ఇవన్నీ కూడా తక్కువ సమయంలో వీటిని ఎక్కువ మొత్తాలలో తాగడాన్ని సులభం చేస్తాయి.
- h. మద్యపానం అనేది, వినోదాత్మక మందుగా సామాజికంగా క్షమించబడుతూనే, పోటీపడటానికి సంబంధించినది కాదని, ప్రశాంతంగా కనిపించటానికి మార్గం కాదని గుర్తుంచుకోండి.
విపరీతమైన తాగుడు యొక్క ప్రభావాల గురించి పెరిగిన అవగాహన మరియు చైత్యం చివరికి సమాజం ఆరోగ్యకరమైన ప్రవర్తనలకు మొగ్గుచూపటానికి ఉపకరిస్తాయి. విపరీతమైన తాగుడు యొక్క ప్రతికూల ప్రభావాల గురించి తల్లిదండ్రులు మరియు పెద్దలు తమ పిల్లలు మరియు సముదాయాలతో మాట్లాడాలి.