పిన్న వయస్కులు తాగటం

పిన్న వయస్కులు తాగటం అంటే కనీసం చట్టబద్దంగా మద్యపానం సేవించే వయసు 21 సంవత్సరాలకు దిగువన ఉన్నవారు ఎవరైనా మద్యపానం చేయటం.

కౌమార దశలోని యువకులు ఎందుకు త్రాగుతారు?

విభిన్న కారణాల వలన పిన్నవయస్కులు త్రాగటం సంభవిస్తోందని గుణాత్మక పరిశోధన సూచిస్తోంది అదీగాక సామాజిక నేపథ్యంలో ప్రతీకాత్మకత నుండి ఆచరణాత్మకత వరకూ మద్యపానం అనేక పాత్రలను పోషిస్తోంది; ఇది ‘పెద్దల’ ప్రవర్తనగా గుర్తింపబడటం లేదా అనుకరించడం అనేది ప్రశ్న కాదు.

ఒక తల్లిగా లేదా తండ్రిగా పిల్లలు మద్యపానాన్ని ఎందుకు త్రాగుతారనే విషయాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వండి తద్వారా మీ బిడ్డ వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునేలా మీరు వారిని ప్రభావితం చేయవచ్చు.

పిల్లలు మద్యం త్రాగటంలో తమ మొదటి అనుభవం ఆహ్లాదకరంగా లేకపోయినప్పటికీ, ఇంకా దాని వైపే మొగ్గు చూపుతారు. దాని రుచిని వారు ఇష్టపడకపోవచ్చు లేదా అది వారినెలా అనుభూతి చెందిస్తుందో తెలియకపోయినా వారు తరచుగా కొనసాగిస్తూనే ఉంటారు. పిన్న వయస్కులు త్రాగటం వలన కలిగే ప్రమాదాలను వారు అర్ధం చేసుకోవటం ముఖ్యం, కానీ ప్రజలు ఎందుకు తాగుతారు మరియు మద్యపాన ప్రభావాలను మీరు ముందుగా పరిష్కరించేంత వరకూ మీరు చెప్పేది వారు వినరు లేదా విశ్వసించరు.

ప్రమాదాన్ని స్వీకరించటం—ఇరవై ఏళ్ళ వయసు వచ్చే వరకూ మెదడు వృద్ధి చెందుతూ ఉంటుంది, ఆ సమయంలో అది ముఖ్యమైన కమ్యూనికేషన్ అనుసంధానాలను ఏర్పరచటాన్ని కొనసాగిస్తూ ఉంటుంది, దాని పనితీరును ఇంకా శుద్ధిపరుస్తూ ఉంటుంది. దీర్ఘకాలంగా సాగే ఈ అభివృద్ధి వ్యవధి — కొత్త మరియు సంభావ్య ప్రమాదకర పరిస్థితులను కోరుకునే వారి సహజ ధోరణి లాంటి కౌమార గుణాలకు చెందిన కొంత ప్రవర్తనను వివరించటంలో ఉపకరించవచ్చు. కొంత మంది కౌమారులు మద్యపానంతో ప్రయోగం చేయటంతో సహా ఉత్కంఠభరిత పరిస్థితులను కోరుకోవచ్చు. కౌమార దశలోని వారు అంత ఉద్రేకంగా ఎందుకు ప్రవర్తిస్తారు, తరచుగా — తాగుడు లాంటి — వారి చర్యలు వలన కలిగే పరిణామాలను ఎందుకు గర్తించరు అనే దానికి శరీరంలో వచ్చే మార్పులు కూడా సంభావ్య శరీరధర్మ వివరణలు ఇస్తాయి.

కాలపు అంచనా —ప్రజలు మద్యపానాన్ని ఎలా భావిస్తారు మరియు దాని ప్రభావాలు కూడా వారు తాగుడు ప్రారంభిస్తారా మరియు ఎంత మొత్తంలో అనే దానితో సహా వారి త్రాగుడు ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. తాగుడు అనేది ఆహ్లాదకరమైన అనుభవం కావచ్చని ఆశించే కౌమారులు అలా అనుకోని వారి కంటే ఎక్కువగా తాగే అవకాశాలను కలిగి ఉంటారు. బాల్యం నుండి కౌమార, యౌవ్వన దశల నుండి వయోజన దశ వరకూ మద్యపాన వైఖరులలో కాలం ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుందనే దానిపై మద్యపాన పరిశోధన ముఖ్యంగా దృష్టి సారిస్తోంది. మద్యపానం గురించి జీవితంలో చాలా శీఘ్రంగా, పిల్లలు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళటం ప్రారంభించటానికంటే ముందుగానే నమ్మకాలు ఏర్పడుతాయి.

సున్నితత్వం మరియు మద్యపానానికి సహనశీలత —మగత, సమన్వయ లోపం మరియు ఉపసంహరణ/వేలాడుతూ ఉండటం లాంటి త్రాగుడు వలన కలిగే ప్రతికూల పరిణామాలను అనుభవించటానికి ముందు వయోజనుల కంటే పిన్న వయస్కులలో చాలా మంది చాలా ఎక్కువ మొత్తాలలో మద్యాన్ని ఎలా సేవించగలుగుతున్నారనేది వివరించటానికి వయోజనుల మెదడు మరియు పరిపక్వమవుతున్న కౌమారుల మెదడు మధ్య వ్యత్యాసాలు కూడా ఉపకరించవచ్చు. ఈ అసాధారణ సహనశీలత యువజనులు అధిక సంఖ్యలో విపరీతంగా తాగడాన్ని వివరించటానికి ఉపకరించవచ్చు. అదే సమయంలో, కౌమార దశలో ఉన్న వారు ప్రత్యేకించి సామాజిక పరిస్థితులలో మరింత సౌకర్యంగా అనుభూతి పొందటం లాంటి త్రాగుడు యొక్క సానుకూల ప్రభావాలకు సన్నితంగా కనిపిస్తారు మరియు ఈ సానుకూల సామాజిక అనుభవాల కారణంగానే యువజనులు కూడా వయోజనుల కంటే ఎక్కువగా తాగుతారు.

వ్యక్తిత్వ గుణాలు మరియు మానసిక సహవ్యాధి ప్రబలత —— చాలా చిన్న వయసులో త్రాగుడు ప్రారంభించిన పిల్లలు తరచుగా ఒకే రకమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు, అవే వారు త్రాగుడు ప్రారంభించటానికి కారణం కావచ్చు. భంగపడిన, అతిక్రియాశీలత గల, దూకుడుతత్వం గల యువజనులు — తరచుగా ప్రవర్తనా సమస్యలు కలిగి ఉన్నట్లు లేదా సంఘ వ్యతిరేకులుగా ఉన్నట్లు సూచించబడతారు — అలాగే వ్యాకులత గల, ఉపసంహరించబడిన, లేదా ఆరాటం గల వారు మద్యపాన సమస్యల రావటానికి అత్యంత పెద్ద ప్రమాదంలో ఉంటారు. మద్యపాన సేవనంతో సంబంధం గల ఇతర ప్రవర్తనా సమస్యలలో తిరుగుబాటుధోరణి, హాని లేదా హానికర పరిస్థితులను నిరోధించటంలో ఇబ్బంది మరియు నియమాలు లేదా ఇతరుల అనుభూతులతో నిమిత్తం లేకుండా ప్రవర్తించే యువజనులలో కనిపించే ఇతర లక్షణాలు ఉన్నాయి.

అనువంశిక కారణాలు —జన్యువులకు నేరుగా సంబంధం కలిగి ఉండేటటువంటి మద్యపాన ప్రభావాలకు సహనశీలతతో సహా మద్యపాన సమస్యలకు ఒక వ్యక్తి ప్రమాదాన్ని పెంచే లేదా తగ్గించే కొన్ని ప్రవర్తనాత్మక మరియు శారీరక కారణాలు కలిసివస్తాయి. ఉదాహరణకు, ఒక తాగుబోతు బిడ్డ కావటం లేదా అనేక మంది మద్యపాన వ్యసనపరులు ఉన్న కుటుంబ సభ్యులను కలిగి ఉండటం ఒక వ్యక్తికి మద్యపాన సమస్యలు వచ్చే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది. సన్నిహిత బంధువులలో మద్యపానం చేసే వారు లేని పిల్లల కంటే మద్యపాన వ్యసనపరుల పిల్లలు మద్యపాన వ్యసనపరులు అయ్యే అవకాశం 4 మరియు 10 రెట్ల మధ్య ఉంటుంది. మద్యపాన వ్యసనపరుల పిల్లలు కూడా చాలా చిన్న వయసులోనే తాగుడు ప్రారంభించే అవకాశాలు ఎక్కువ ఇంకా తాగుడు వలన కలిగే సమస్యలు కూడా వీరిలో ఎక్కువ వేగంగా వృద్ధి చెందుతాయి.

Please select the social network you want to share this page with:

We like you too :)

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Donec tincidunt dapibus dui, necimas condimentum ante auctor vitae. Praesent id magna eget libero consequat mollis.

SIMILAR POSTS
No comments yet

Enter the Discussion and post your Comment