
మీరు తాగి నడపకుండా ఉండేలా చూడటం ఎలా?
గాయపడకుండా ఉండటానికి, కారు నడిపే సమయంలో మీరు తాగి ఉండరాదు. మీరు మత్తులో లేకుండా ఉండవచ్చు, కానీ మీ వైపుగా వస్తున్న డ్రైవర్ గట్టిగా గుద్దవచ్చు. కనుక ఇక్కడ మీ ప్రాణాన్ని మరియు ఇతరుల ప్రాణాల్ని కాపాడటానికి మీరు చేయగలిగింది ఏమిటంటే:
- మీరెక్కడ నడుపుతున్నా తిని నడపండి, నవ్వుతూ నడపండి, మాట్లాడుతూ నడపండి కానీ దయచేసి తాగి నడపకండి.
- తాగిన వ్యక్తి నడిపే కారులో ఎన్నడూ ప్రయాణించకండి.
- మీరు సామూహికంగా తాగినప్పుడు ఇంటికి వెళ్ళటానికి ఎల్లప్పుడూ ఒక టాక్సీని లేదా డ్రైవర్ను పిలవండి.
- మీ మిత్రులు లేదా సహోద్యోగులు తాగి ఉన్నప్పుడు ఎన్నడూ కారు నడిపేందుకు వారిని అనుమతించకండి.
- మీరు ఒక సమూహంలో ఉండి, వేరే ఊళ్ళో విహారయాత్రకు వెళ్తున్నప్పుడు, మద్యపానం సేవించకుండా కారు నడిపేందుకు ఒక వ్యక్తిని వెంట తీసుకెళ్ళండి.
- ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు, తిరుగు ప్రయాణంలో కారు నడిపేందుకు ఒక వ్యక్తిని (మద్యం సేవించని వారిని) ముందుగా నియమించుకోండి.
- మీరు ఎవరినైనా ఆహ్వానించి, మద్యం అందిస్తున్నప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేలా చూసేందుకు – బాధ్యతగా ప్రవర్తించండి.
- కారు నడపటం తప్ప మరో అవకాశం లేనప్పుడు, ఆల్కహాల్ ఉండని బీర్, మాక్ టెయిల్స్ లేదా ప్రామాణిక మద్యరహిత పానీయాలకు పరిమితం అవ్వండి.
- ప్రతి రాత్రీ ఒక బార్లోనో లేదా పబ్లోనే గడపనక్కర్లేదు – ఒక రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకోండి, హైవే మీద ఢాబాకు వెళ్ళండి లేదా మీ నగరంలోని కొత్తగా తెరిచిన ఫుడ్ ట్రక్ ను సందర్శించండి.